Header Banner

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

  Mon May 19, 2025 10:43        Others

హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల కుట్రను తెలుగు రాష్ట్రాల్లోని నిఘా సంస్థలు భగ్నం చేశాయి. అందుకు సంబంధించి ఇద్దరు నిందితులు సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్‌లను పోలీస్ వర్గాలు ఇప్పటికే అరెస్ట్ చేశాయి. విచారణలో భాగంగా వీరి నుంచి పోలీసులు సంచలన విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. సిరాజ్, సయ్యద్ సమీర్‌లు.. అహిం పేరిట సంస్థ ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరిద్దరు.. దీని వేదికగా సంప్రదింపులు జరిపారు.

అలాగే సౌదీ అరేబియా నుంచి ఉగ్రవాద సంస్థ.. వీరిద్దరిని ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. సదరు ఉగ్రవాద సంస్థ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరికి దిశానిర్దేశం చేసినట్లు కనుగొన్నారు. అదే విధంగా తమ ఉగ్రవాద కార్యకలాపాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు సైతం విస్తారించాలనే ప్రయత్నం వీరిద్దరు చేసినట్లు పోలీసులు నిర్దారించారు.

ఇక బాంబు పేలుళ్ల కోసం క్లోరేట్, సల్ఫర్‌తోపాటు పేలుడు పదార్థాలను ఈ నిందితులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఈ పేలుడ పదార్థాలపై ఆన్ లైన్ ద్వారా వీరు అవగాహన కల్పించుకున్నట్లు తెలుస్తోంది. మే 21, 22వ తేదీన విజయనగరంలో బాంబ్ పేలుళ్ల రీహార్సల్ చేయాలని వీరిద్దరు నిర్ణయించారు. ఈ కుట్రను సైతం పోలీసులు భగ్నం చేశారు.

 మరోవైపు సిరాజ్, సయ్యద్ సమీర్‌లు ఇద్దరు.. మైనర్లతో తరచు సమావేశాలు నిర్వహించి.. ఉగ్రవాద కార్యకలాపాల గురించి వారికి వివరించినట్లు సమాచారం. హ్యాండ్లర్.. వీరికి అగ్గిపుల్ల మందుతో బాంబు ఎలా తయారు చేయాలో ఫైల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగానే ఈ ఇద్దరు బాంబు తయారు చేసినట్లు గుర్తించారు.

మరోవైపు వీరిద్దరికి 14 రోజులపాటు విజయనగరం కోర్టు రిమాండ్ విధించింది. అదీకాక ఆదివారం విజయనగరంలోని సిరాజ్ నివాసంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన సిరాజ్ ఉర్ రెహమాన్ విజయనగరం వాసి కాగా.. సయ్యద్ సమీర్ సికింద్రాబాద్‌లోని బోయగూడ చెందిన వాడు.

ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ.. దేశంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందులోబాగంగా దేశంలొని అన్ని ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేసింది. అలాంటి వేళ.. హైదరాబాద్ వేదికగా బాంబు పేలుళ్లకు చేసిన కుట్రను ఏపీ, తెలంగాణ నిఘా వర్గాలు భగ్నం చేశాయి.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #BombPlotFoiled #TerrorConspiracy #BreakingNews #ExplosiveRevelations #NationalSecurity